Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : క్రికెట్లో ప్రజాదరణలో ఉన్న పదం బ్యాట్స్మన్. ఇక నుంచి బ్యాట్స్మన్ పదం కనుమరుగు కానుంది!. లింగ భేదం లేని పదాలను తీసుకొచ్చేందుకు ది మేర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), ఐసీసీలు తటస్థ పదాలను తీసుకొస్తున్నాయి. ఈ మేరకు ఎంసీసీ బుధవారం కీలక సవరణలకు ఆమోదం తెలిపింది. లింగ తటస్థ కోసం బ్యాట్స్మన్, బ్యాట్స్మెన్ పదాలను తొలగిస్తూ.. బ్యాటర్, బ్యాటర్స్ పదాలను తీసుకొచ్చింది. మహిళల క్రికెట్కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఎంసీసీ నిర్ణయం అమ్మాయిల ఆటకు ఉత్సాహం తీసుకు రానుందని చెప్పవచ్చు.