Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో భారత్ రెండో వన్డే నేడు
మకాయ్ : వరుసగా 25 వన్డేల్లో విజయాలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు చెక్ పెట్టేందుకు మిథాలీరాజ్ సేన సిద్ధమవుతోంది. తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా విఫలమైన భారత అమ్మాయిలు.. నేడు రెండో వన్డేలో లెక్క సరి చేయాలని చూస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది. దీంతో స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, మిథాలీరాజ్‌లకు తోడు హర్మన్‌ప్రీత్ రాణిస్తే భారత బ్యాటింగ్ కష్టాలకు శుభం కార్డ్ పడినట్టే!. బౌలింగ్ లైనప్‌లో జులన్ గోస్వామికి తోడుగా యువ పేసర్లు రాణించాల్సి ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. నేడు విజయం సాధిస్తేనే సిరీస్‌పై భారత్‌కు ఆశలు ఉంటాయి. అప్రతిహాత జైత్రయాత్రలో ఉన్న ఆస్ట్రేలియాను ఓడించటం అంత సులువు కాదనే విషయం మిథాలీసేనకు తెలుసు. రెండో వన్డే నేడు ఉదయం 10.40 నుంచి సోనీనెట్వర్క్లో ప్రసారం..