Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిక ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : టేబుల్ టెన్నిస్ జాతీయ కోచ్ సౌమ్యదీప్ రారుపై స్టార్ క్రీడాకారిణి మనిక బత్ర చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని (క్రీడా మంత్రిత్వ శాఖ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జాతీయ శిక్షణ శిబిరంలో హాజరు తప్పనిసరి చేస్తూ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని మనిక బత్ర హైకోర్టులో సవాల్ చేసింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌కు జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు నేషనల్ క్యాంప్ హాజరు తప్పనిసరి నిబంధనలపై స్టే విధిస్తూ జస్టిస్ రేఖ పల్లి ఆదేశాలు జారీ చేశారు. జాతీయ కోచ్‌పై ఆరోపణలు చేసిన మనిక బత్ర.. నేషనల్ క్యాంప్‌కు డుమ్మా కొట్టింది. పుణెలో వ్యక్తిగత కోచ్ వద్ద శిక్షణ తీసుకుంది. దీంతో ఆసియా చాంపియన్‌షిప్స్‌కు బత్ర పేరును టేబుల్ టెన్నిస్ సమాఖ్య పరిగణనలోకి తీసుకోలేదు. నేషనల్ కోచ్‌పై తీవ్ర ఆరోపణలు ఉండగా.. శిక్షణ శిబిరం హాజరు నిబంధనలకు విలువ లేదని కోర్టు అభిప్రాయపడింది. సౌమ్యదీప్ రారు శిక్షణలోని మరో క్రీడాకారిణికి లబ్ది చేకూర్చేందుకు.. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో ఓటమి చెందాలని కోచ్ ఒత్తిడి తెచ్చినట్టు మనిక బత్ర ఆరోపించింది.