Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడి
భువనేశ్వర్ : మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్‌కప్‌కు ఒడిశా ఆతిథ్యం ఇవ్వనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 24-డిసెంబర్ 5న మెన్స్ జూనియర్ హాకీ ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఈ మ్యాచులకు వేదికగా నిలువనుందని ఒడిశా సీఎం వెల్లడించారు. ' కరోనా మహమ్మారి పరిస్థితుల్లో మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు చేసేందుకు ఇది చాలా తక్కువ సమయం. అయినప్పటికీ, దేశ ప్రతిష్ట ఇమిడి ఉన్న అంశం కావటంతో వరల్డ్‌కప్ నిర్వహణకు అంగీకారం తెలిపాం. డిఫెండింగ్ చాంపియన్ భారత్ సొంత గడ్డ అనుకూలతను సొమ్ము చేసుకుంటుందని ఆశిస్తున్నాను' అని పట్నాయక్ అన్నారు. 2021 మెన్స్ హాకీ జూనియర్ ప్రపంచకప్ ట్రోఫీ, లోగోలను ఈ సందర్భంగా సీఏం విడుదల చేశారు.