Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడోదర : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ గెలిచిన కోచ్ డెవ్ వాట్మోర్ మరోసారి భారత దేశవాళీ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టాడు. బరోడా క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా డెవ్ వాట్మోర్ వ్యవహరించాడు. రానున్న దేశవాళీ సీజన్ నిమిత్తం బరోడా క్రికెట్ సంఘం ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌ను నియమించింది. రంజీ జట్టుతో పాటు అండర్-19, మహిళల జట్లకు సైతం వాట్మోర్ చీఫ్ కోచ్‌గా ఉండనున్నారు. బరోడా క్రికెట్ సంఘంలోని ఇతర కోచ్‌లకు మార్గదర్శకుడిగా ఉండనున్నాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి అజిత్ లెలె తెలిపారు. 67 ఏండ్ల వాట్మోర్ 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంక జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించారు. నేపాల్ జట్టు చీఫ్ కోచ్‌గా ఉన్న వాట్‌మోర్‌ను బరోడా తీసుకొచ్చింది.