Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : జమ్ము కాశ్మీర్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ జాక్‌పాట్ కొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ అతడిని జట్టులోకి తీసుకుంది. రెగ్యులర్ సీమర్ టి.నటరాజన్ కోవిడ్-19 బారిన పడటంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో కొనసాగుతున్నాడు. నటరాజన్ స్థానంలో తాత్కాలిక సర్దుబాటుగా ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెలిపింది. నటరాజన్ కోవిడ్-19 నుంచి కోలుకుని జట్టులోకి చేరుకునేంత వరకు ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ జట్టులో భాగంగా కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా యుఏఈలోనే ఉన్నాడు.