Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్‌పై చెన్నై అలవోక విజయం
నవతెలంగాణ-షార్జా
చెన్నై సూపర్‌కింగ్స్ అదిరే విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 157 పరుగుల లక్ష్యాన్ని సూపర్‌కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (38, 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (31, 26 బంతుల్లో 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించగా.. మోయిన్ అలీ (23, 18 బంతుల్లో 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (32, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చెన్నై గెలుపు ఖాయం చేశారు. సురేశ్ రైనా (17 నాటౌట్,10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఎం.ఎస్ ధోని (11 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు) మరో 11 బంతులు ఉండగానే లాంఛనం ముగించారు. యుఏఈలో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కాగా.. బెంగళూర్‌కు వరుసగా రెండో ఓటమి. ఏడు విజయాలతో సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరుకుంది. అంతకముందు, దేవదత్ పడిక్కల్ (70, 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (53, 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో తొలి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యంతో మెరిసినా.. బెంగళూర్ భారీ స్కోరు చేయలేదు. ఏబీ డివిలియర్స్ (12), గ్లెన్ మాక్స్వెల్ (11), టిమ్ డెవిడ్ (1), హర్షల్ పటేల్ (3), హసరంగ (1)లు 29 బంతుల్లో 28 పరుగులే చేయటంతో బెంగళూర్ ఆశించిన స్కోరు సాధించలేదు. ఐదుగురు బౌలర్లను అద్భుతంగా వినియోగించిన ఎం.ఎస్ ధోని బెంగళూర్‌ను 156/6కు పరిమితం చేశాడు. తొలి పది ఓవర్లలో 90 పరుగులు చేసిన బెంగళూర్.. చివరి పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసి మూల్యం చెల్లించింది.
ఓపెనర్లు అదుర్స్ : టాస్ నెగ్గిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్న బౌండరీల షార్జాలో ఊహించినట్టుగానే పరుగుల వరద పారింది. పవర్‌ప్లేలో బెంగళూర్ 55/0తో దూకుడుగా ఆడింది. దీపక్ చాహర్‌ను చితకబాదిన కోహ్లి అతడి గణాంకాలను సవరించాడు. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. పడిక్కల్ రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 35 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించగా.. విరాట్ కోహ్లి ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. పది ఓవర్లలో 90/0తో బెంగళూర్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. విరాట్ కోహ్లి నిష్క్రమణ బెంగళూర్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. మిడిల్ ఆర్డర్లో ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, డెవిడ్, హసరంగ, హర్షల్ పటేల్‌లు పరిస్థితులకు తగినట్టు ఆడలేదు. చివరి పది ఓవర్లలో పట్టు బిగించిన చెన్నై సూపర్‌కింగ్స్.. బెంగళూర్ జోరుకు ముకుతాడు వేసింది. డ్వేన్ బ్రావో (3/24), శార్దుల్ ఠాకూర్ (2/29)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 156/6 (పడిక్కల్ 70, విరాట్ కోహ్లి 53, బ్రావో 3/24, ఠాకూర్ (2/29)
చెన్నై సూపర్‌కింగ్స్ : 157/4 ( రుతురాజ్ 38, రాయుడు 32, డుప్లెసిస్ 31, హర్షల్ పటేల్ 2/25)
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 చెన్నై 09 07 02 14
2 ఢిల్లీ 09 07 02 14
3 బెంగళూర్ 09 05 04 10
4 కోల్‌కత 09 04 05 08
5 రాజస్థాన్ 08 04 04 08
6 ముంబయి 09 04 05 08
7 పంజాబ్ 09 03 06 06
8 హైదరాబాద్ 08 01 07 02
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు