Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో ఏర్పాటు చేసిన బీసీసీఐ
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో అన్ని ప్రాంఛైజీల కోవిడ్-19 పరీక్షలు, ఫలితాల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోవిడ్-19 సెంట్రల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. క్రికెటర్లు, సహాయక సిబ్బందికి రెగ్యులర్‌గా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలను వెంటనే ప్రాంఛైజీలతో పాటు బీసీసీఐతో ఈ ఏజెన్సీ పంచుకోనుంది. వీపీఎస్ హెల్త్‌కేర్ ఏజెన్సీని ఈ మేరకు బీసీసీఐ నియమించింది. గతంలో కోవిడ్-19 ఏజెన్సీలను ప్రాంఛైజీలు నియమించుకునేవి. ఈ సారి ఐపీఎల్ బయో బబుల్‌ను స్వయంగా బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. సన్‌రైజర్స్ శిబిరంలో నటరాజన్‌కు పాజిటివ్, మరో ఆరుగురు ఐసోలేషన్‌లో ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ రోజు ఆటగాళ్లు, సిబ్బంది హోటల్ గది నుంచి మైదానానికి బయల్దేరే ముందు అందరి శరీర ఉష్ణోగ్రతల వివరాలను ప్రాంఛైజీలు బీసీసీఐతో పంచుకోవాల్సి ఉంది. ఐపీఎల్14ను సురక్షితంగా నిర్వహించేందుకు బీసీసీఐ తాజాగా 48 పేజీలతో కూడిన కోవిడ్-19 మార్గదర్శకాలను ప్రాంఛైజీలకు పంపించింది.