Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లెన్ మాక్స్వెల్ అర్థ సెంచరీ
- రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 165/6
దుబాయ్ (యఏఈ)
విరాట్ కోహ్లి (51, 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ మాక్స్వెల్ (56, 37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగటంతో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 165/6 పరుగుల స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా (3/36) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు.
టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ తొలుత బెంగళూర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే ముంబయికి బ్రేక్ లభించింది. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0)ను జశ్‌ప్రీత్ బుమ్రా డకౌట్ చేశాడు. ఆంధ్రా ఆటగాడు కె.ఎస్ భరత్ (32, 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు విలువైన 68 పరుగులు జోడించాడు. భరత్ నిష్క్రమించినా.. గ్లెన్ మాక్స్వెల్ (56) బెంగళూర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోహ్లి మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేయగా.. గ్లెన్ మాక్స్వెల్ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో వీర విహారం చేశాడు.
ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత డెత్ ఓవర్లలో బెంగళూర్ వేగం తగ్గింది. ఏబీ డివిలియర్స్ (11), డాన్ క్రిస్టియన్ (1), షాబాజ్ నదీమ్ (1), కైల్ జెమీసన్ (2 నాటౌట్) అంచనాలను అందుకోలేదు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, మిల్నె, రాహుల్ చాహర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్లో నేడు
హైదరాబాద్ x రాజస్థాన్
వేదిక : దుబారు, సమయం : రాత్రి: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 చెన్నై 10 08 02 16
2 ఢిల్లీ 10 08 02 16
3 బెంగళూర్ 09 05 04 10
4 కోల్‌కత 10 04 06 08
5 పంజాబ్ 10 04 06 08
6 ముంబయి 09 04 05 08
7 రాజస్థాన్ 09 04 05 08
8 హైదరాబాద్ 09 01 08 02