Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌పై అమ్మాయిల రికార్డు ఛేదన
- షెఫాలీ, భాటియా, గోస్వామి మెరుపులు
- 2-1తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశం
కంగారూ అమ్మాయిల జైత్రయాత్రకు టీమ్ ఇండియా అమ్మాయిలు చెక్ పెట్టారు. ఆస్ట్రేలియా మహిళల జట్టు అప్రతిహాత వరుస 26 వన్డే విజయాల జోరుకు బ్రేక్ వేశారు. 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని 49.3 ఓవర్లలోనే ఊదేసిన భారత్ మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది. రెండో వన్డేలో 'నో బాల్' భారత్‌కు విజయాన్ని దూరం చేయగా.. మూడో వన్డేలో మిథాలీసేన అన్ని రంగాల్లోనూ రెచ్చిపోయింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది.
మకారు (క్వీన్స్లాండ్)
భారత్ లక్ష్యం 265 పరుగులు. 2019లో దక్షిణాఫ్రికాపై ఛేదించిన 248 పరుగులే భారత క్రికెట్లో అత్యధిక ఛేదన. ఆస్ట్రేలియా బౌలర్ల ఫామ్, సిరీస్‌ను సాధించిన ఉత్సాహం ముందు భారీ ఛేదనలో టీమ్ ఇండియా అమ్మాయిలు అదరగొడతారనే అంచనాలు తక్కువ. మిథాలీ గ్యాంగ్ అంచనాలతో పాటు ఆసీస్‌ను తలకిందులు చేసింది. 2017 నుంచి వన్డేల్లో అపజయమే ఎరుగని కంగారూ జట్టుకు.. సొంతగడ్డపైనే ఓటమి రుచి చూపించారు. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (56, 91 బంతుల్లో 7 ఫోర్లు), యస్టికా భాటియా (64, 69 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. స్నేV్‌ా రానా (30, 27 బంతుల్లో 5 ఫోర్లు), దీప్తి శర్మ (31, 30 బంతుల్లో 3 ఫోర్లు) చివర్లో చితక్కొట్టారు. ఛేదనలో సమిష్టి మెరుపులతో 49.3 ఓవర్లలోనే భారత్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. అష్లె గార్డ్నర్ (67, 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెత్ మూనీ (52, 64 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (3/37) బంతితో నిప్పులు చెరిగే ప్రదర్శన చేసి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. వన్డే సిరీస్ 2-1తో ఆస్ట్రేలియా వశమైంది.
ఛేదన అదరహో : రికార్డు ఛేదనలో ఓపెనర్లు భారత్‌కు అదిరే ఆరంభం అందించారు. షెఫాలీ వర్మ (56), స్మృతీ మంధాన (22, 25 బంతుల్లో 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులతో అర్థ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. సహజ శైలికి భిన్నంగా షెఫాలీ నెమ్మదిగా ఆడింది. 91 బంతుల్లో ఏడు బౌండరీలతో 56 పరుగులు చేసింది. మూడు ఫోర్లతో మెరిసిన మంధాన తొలి వికెట్ రూపంలో నిష్క్రమించింది. యస్టికా భాటియా (64, 69 బంతుల్లో 9 ఫోర్లు)తో కలిసి షెఫాలీ రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించింది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. స్వల్ప విరామంలో షెఫాలీ, రిచా ఘోష్ (0) సహా మిథాలీరాజ్ (16), పూజ (3) వికెట్లను కోల్పోయినా.. ఛేదనలో భారత్ జోరు తగ్గలేదు. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ (31, 30 బంతుల్లో 3 ఫోర్లు), స్నేV్‌ా రానా (30, 27 బంతుల్లో 5 ఫోర్లు) అదరగొట్టారు. ఈ ఇద్దరి జోరుతో భారత్ గెలుపు లాంఛనం చేసుకుంది. ఆఖరు ఓవర్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. జులన్ గోస్వామి (8 నాటౌట్) బౌండరీతో లాంఛనం ముగించింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఛేదన కాగా, ఆస్ట్రేలియాపై ఓ జట్టుకు ఇది రెండో అత్యధిక ఛేదన. 2017లో న్యూజిలాండ్ 276 పరుగులను ఛేదించటమే ఆసీస్‌పై అతి పెద్ద రికార్డు. ఇప్పుడు భారత్ కంగారూ గడ్డపైనే ఆ జట్టుపై రికార్డు ఛేదనను ఊదేయటంతో పాటు.. వన్డేల్లో ఆ జట్టు వరుస విజయాల జోరుకు బ్రేక్ వేసింది.
మూనీ, తహ్లియా జోరు : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి ఆసీస్‌ను కట్టడి చేసింది. రేచల్ (13), మెగ్ లానింగ్ (0) సహా హీలే (35), పెర్రీ (26) నిష్క్రమణతో ఆస్ట్రేలియా 87/4తో ఒత్తిడిలో పడింది. రెండో వన్డేలో అపూర్వ ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన బెత్ మూనీ (52), తహ్లియ మెక్‌గ్రాత్ (47) మరోసారి మెరిశారు. వీరికి తోడు ఆష్లె గార్డ్నర్ (67) అర్థ సెంచరీ బాదటంతో ఆస్ట్రేలియా 264 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో గోస్వామి (3/37), పూజ (3/46) మూడేసి వికెట్లతో మంచి ప్రదర్శన చేశారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : రేచల్ (సి) షెఫాలీ (బి) గోస్వామి 13, అలీసా (రనౌట్) 35, మెగ్ లానింగ్ (సి) రీచా (బి) గోస్వామి 0, ఎలిసీ పెర్రీ (సి) దీప్తి (బి) పూజ 26, బెత్ మూనీ (బి) రానా 52, గార్డ్నర్ (సి) మిథాలీ (బి) పూజ 67, తహ్లియ (సి) రీచా (బి) పూజ 47, నికోల నాటౌట్ 12, సుథర్లాండ్ (సి) దీప్తి (బి) గోస్వామి 0, సోఫీ (రనౌట్)1, కాంప్‌బెల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264.
వికెట్ల పతనం : 1-41, 2-41, 3-62, 4-87, 5-185, 6-224, 7-260, 8-261, 9-263.
బౌలింగ్ : జులన్ గోస్వామి 10-2-37-3, మేఘ్న సింగ్ 6-0-37-0, రాజేశ్వరి గైక్వాడ్ 9-1-56-1, స్నేV్‌ా రానా 9-1-56-1, దీప్తి శర్మ 7-0-46-0, పూజ 9-1-46-3.
భారత్ ఇన్నింగ్స్ : షెఫాలీ వర్మ (బి) సోఫీ 56, మంధాన (సి) సుథర్లాండ్ (బి) గార్డ్నర్ 22, యస్టికా భాటియా (సి) స్ట్రోనో (బి) కాంప్‌బెల్ 64, రిచా ఘోష్ (సి) గార్డ్నర్ (బి) సుథర్లాండ్ 0, మిథాలీరాజ్ (సి) సుథర్లాండ్ 16, పూజ (బి) సుథర్లాండ్ 3, దీప్తి శర్మ (సి) నికోల (బి) తహ్లియా 31, స్నేV్‌ా రానా (సి) డార్లింగ్టన్ (బి) నికోల 30, జులన్ గోస్వామి నాటౌట్ 8, మేఘ్న సింగ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 34, మొత్తం : (49.3 ఓవర్లలో 8 వికెట్లకు) 266.
వికెట్ల పతనం : 1-59, 2-160, 3-161, 4-180, 5-192, 6-208, 7-241, 8-259.
బౌలింగ్ : ఎలిసీ పెర్రీ 5-0-34-0, తహ్లియ మెక్‌గ్రాత్ 6-0-46-1, సోఫీ 9.3-1-41-1, గార్డ్నర్ 6-0-30-1, స్టెల్లా కాంప్‌బెల్ 9-1-41-1, నికోల కేరీ 7-0-42-1, సుథర్లాండ్ 7-0-30-3.