Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0-5తో చైనా చేతిలో ఓటమి
- సుధీర్మన్ కప్‌లో టీమ్ ఇండియా
న్యూఢిల్లీ : అగ్రషట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్ సహా డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి లేకపోవటం భారత్‌ను గట్టి దెబ్బ తీసింది. మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుధీర్మన్ కప్ గ్రూప్-ఏలో తొలుత థారులాండ్ చేతిలో 1-4తో మట్టికరిచిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లో 11 సార్లు చాంపియన్ చైనా చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. వరుసగా రెండు భారీ ఓటములతో క్వార్టర్‌ఫైనల్స్ అవకాశాలను ఆవిరి చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో సింధు, సైనా.. డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ లేకపోవటంతో ఈ విభాగాల్లో భారత్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత మెన్స్ డబుల్స్ విభాగంలో ఎంఆర్ అర్జున్ ధ్రువ్ కపిల్ 20-22, 17-21తో గట్టి పోటీనిచ్చారు. వరల్డ్ నం.15, బి సాయి ప్రణీత్ మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ మాజీ విజేత షి యుకీ చేతిలో 10-21, 10-21తో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప, ఎన్. సిక్కిరెడ్డి జంట 16-21, 13-21తో వరల్డ్ నం.15 జోడీ జెంగ్ యు , లి వెన్ మీ చేతిలో ఖంగుతిన్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, రితుపర్ణ 9-21, 9-21తో కనీస పోటీ ఇవ్వలేదు. మెన్స్ సింగిల్స్ మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణీత్ పోరాడకుండానే చేతులెత్తేశాడు. 5-0తో భారత్‌పై ఘన విజయం సాధించిన చైనా క్వార్టర్ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది.