Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతనంగా 300 మంది సైంటిఫిక్ స్టాఫ్
- టాప్స్ అథెట్ల కోసం ప్రత్యేక సెక్రటేరియట్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెట్ల ప్రదర్శనలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు.. ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో పతకాల సాధనలో మరింత శాస్త్రీయంగా సన్నద్ధం అయ్యేందుకు అనుగుణంగా భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన సమావేశమైన 55వ సారు పాలక మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. సారు కోచింగ్ వ్యవస్థను బలోపేతం నిమిత్తం 300 మంది సైంటిఫిక్ సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో 138 మంది హై పర్ఫార్మెన్స్ అనలిస్ట్‌లు, 23 మంది హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, 23 మంది స్పోర్ట్స్ మెడిసిన్ వైద్యులు, 93 మంది ఫిజియోథెరపిస్ట్‌లు, 104 మంది మసాజ్ థెరపిస్ట్‌లను నూతనంగా నియమించనున్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) అథ్లెట్ల కోసం ప్రత్యేక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఓ సీఈవో, 22 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఈ సెక్రటేరియట్లో స్పోర్ట్స్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ సైన్స్, పరిశోధన, పార్ట్నర్షిప్స్, కమ్యూనికేషన్, పాలసీ అండ్ లెర్నింగ్ విభాగాలు ఉండనున్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో రాణించిన హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, సవిత (గోల్‌కీపర్), పియూశ్ దూబే (హాకీ కోచ్), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెట్), శరద్ కుమార్ (పారా అథ్లెట్)లకు ప్రమోషన్ కల్పిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.