Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కింగ్స్ 135/6
నవతెలంగాణ-అబుదాబి
యుఏఈలో స్వల్ప స్కోర్ల పరంపర కొనసాగుతోంది. మందకోడి పిచ్‌లపై పరుగులు చేయటం గగనం అవుతుండగా..పచ్చిక సాయంతో పేస్ బౌలర్లు రెచ్చిపోతున్నారు. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడిన అబుదాబి మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. ముంబయి పేసర్ల ప్రతాపానికి పంజాబ్ కింగ్స్ కుదేలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ 135 పరుగులే చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎడెన్ మార్కరం (32, 29 బంతుల్లో 6 ఫోర్లు), దీపక్ హుడా (28, 26 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించటంతో పంజాబ్ కింగ్స్ గౌరవ ప్రద స్కోరు నమోదు చేసింది. ముంబయి బౌలర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా (2/24), కీరన్ పొలార్డ్ (2/8) రెండేసి వికెట్లతో అదరగొట్టారు.
బుమ్రా, పొలార్డ్ సూపర్ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు మంచి ఆరంభమే లభించింది. కానీ మంచి ఆరంభాన్ని ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (21, 22 బంతుల్లో 2 ఫోర్లు), మన్దీప్ సింగ్ (15, 14 బంతుల్లో 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో దూకుడు చూపకపోయినా.. సాధికారిక ఆధిపత్యం చెలాయించారు. కృనాల్ పాండ్య ఓవర్లో మన్దీప్ సింగ్ నిష్క్రమించగా.. ఆ తర్వాతి ఓవర్లో కీరన్ పొలార్డ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రిస్ గేల్ (1) క్రీజులో ఉండగా పొలార్డ్ చేతికి బంతినిచ్చిన రోహిత్ శర్మ ఫలితం రాబట్టాడు. ఓ ఓవర్లో క్రిస్ గేల్, కెల్ రాహుల్‌ను అవుట్ చేసిన పొలార్డ్ పంజాబ్ కింగ్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఒక్క ఓవర్ వేసిన పొలార్డ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్ ఆర్డర్లో ఎడెన్ మార్కరం (42), దీపక్ హుడా (28)లు ఆకట్టుకున్నారు. పరుగుల సాధన కష్టమైన తరుణంలో ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ ఇద్దరి ప్రదర్శనతో పంజాబ్ 135 పరుగులైనా చేసింది. మిడిల్ఆర్డర్లో కీలక బ్యాటర్ నికోలస్ పూరన్ (2) పేలవ ఫామ్ కొనసాగించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బరార్ (14 నాటౌట్), నాథన్ ఎల్లిస్ (6 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. పూరన్, హుడా వికెట్లు తీసిన బుమ్రా పంజాబ్‌ను కట్టడి చేశాడు. ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.