Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2021-22 సీజన్‌కు హైదరాబాద్ ఎఫ్‌సీ సరికొత్త జెర్సీని ఆవిష్కరించింది. ప్రముఖ క్రీడా దుస్తుల తయారీ సంస్థ హమ్మెల్ హెచ్ఎఫ్సీ కిట్ స్సాన్సర్‌గా నిలిచింది. ఎంపిక చేసిన అభిమానులు, సినీ నటుడు రానా దగ్గుబాటిలతో కూడిన వీడియో ద్వారా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ' హైదరాబాద్ ఎఫ్‌సీ కొత్త జెర్సీ ఆవిష్కరణ సంతోషాన్ని ఇచ్చింది. భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంలో హైదరాబాద్‌ది కీలక పాత్ర. అటువంటి హైదరాబాద్ నగర సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే రంగుల (పసుపు, నలుపు)తో జెర్సీ రూపొందించాం. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ తీసుకురావటమే మా లక్ష్యం' అని హైదరాబాద్ ఎఫ్‌సీ సహ యజమాని త్రిపురనేని వరుణ్ తెలిపారు.