Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్‌తో నేడు ఢీ
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-షార్జా : ప్లే ఆఫ్స్‌లో చోటుకు ఓ విజయం దూరంలో నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ నేడు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. యుఏఈలో వరుసగా మూడు మ్యాచుల్లో ముంబయి, బెంగళూర్, కోల్‌కతలను ఓడించిన ధోనీసేన నేడు సన్‌రైజర్స్‌తో సమరానికి రెఢ అవుతోంది. చెన్నై శిబిరంలో అందరూ జోరందుకున్నారు. బ్యాట్‌తో చివరి బ్యాటర్ వరకు బౌండరీలు బాదగలరు. టాప్ ఆర్డర్లో డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు నిలకడగా భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. ఆఖర్లో రవీంద్ర జడేజా, శామ్ కరణ్ మెరుపు ముగింపులు ఇస్తున్నారు. టెయిలెండర్లు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ స్పెషలిస్ట్ బ్యాటర్ తరహాలో రెచ్చిపోతున్నారు. బంతితోనూ పటిష్టంగా కనిపిస్తోన్న సూపర్‌కింగ్స్ స్వల్ప స్కోర్లు నమోదైతున్న షార్జాలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్లో రెండో విజయంతో కాస్త ఊరట తెచ్చుకుంది. స్టార్ ఆటగాడు డెవిడ్ వార్నర్‌ను పూర్తిగా పక్కనపెట్టిన సన్‌రైజర్స్ అతడి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రారును తుది జట్టులోకి తీసుకుంది. ఈ మార్పు సన్‌రైజర్స్‌కు తొలి విజయాన్ని కట్టబెట్టింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం అజేయ అర్థ సెంచరీతో రాయల్స్‌పై చెలరేగాడు. స్వదేశీ ఆటగాళ్లలో వృద్దిమాన్ సాహా ఒక్కడే రాణిస్తున్నాడు. మనీశ్ పాండే పేలవ ఫామ్ కొనసాగుతోంది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ రాణించటం సన్‌రైజర్స్‌కు సానుకూలం. ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతోంది.