Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకా తీసుకోని అథ్లెట్లకు 2022 ఒలింపిక్స్ రూల్
బీజింగ్ : కోవిడ్-19 టీకా తీసుకోని అథ్లెట్లు 21 రోజులు క్వారంటైన్లో ఉండాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) వెల్లడించింది. 2022 వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజధాని బీజింగ్ ఆతిథ్యం ఇస్తోంది. మెగా ఈవెంట్‌తో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. టీకా తీసుకోని అథ్లెట్లు చైనాలో 21 రోజులు క్వారంటైన్లో గడపాల్సి ఉండగా, టీకా తీసుకున్న అథ్లెట్లు ఇతర సహాయక సిబ్బందికి ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు అందరికీ ప్రతి రోజు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఐఓసీ తెలిపింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సైతం విదేశీ అభిమానులకు అనుమతి ఇవ్వటం లేదు. చైనా అభిమానులు వింటర్ ఒలింపిక్స్ స్టేడియాల్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. విదేశీ ప్రేక్షకులకు అనుమతి నిరాకరించారు.