Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ హైదరాబాద్ 134/7
నవతెలంగాణ-షార్జా : చెన్నై సూపర్‌కింగ్స్ అదరగొట్టింది. బౌలర్లు సమిష్టిగా రాణించటంతో సూపర్‌కింగ్స్ మరో విజయం దిశగా సాగుతోంది!. డ్వేన్ బ్రావో (2/17), జోశ్ హజిల్‌వుడ్ (3/24), రవీంద్ర జడేజా (1/14) మ్యాజిక్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 134/7 పరుగులు చేసింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా (44, 46 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ (18, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), అబ్దుల్ సమద్ (18, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) హైదరాబాద్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
బ్యాటర్ల వైఫల్యం : స్వల్ప స్కోర్లు నమోదవుతున్న షార్జాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరు చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్ రారు (2), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11, 11 బంతుల్లో 2 ఫోర్లు) నిష్క్రమణ హైదరాబాద్ ఇన్నింగ్స్‌పై పెను ప్రభావం చూపించింది. ఇద్దరు కీలక బ్యాటర్ల వైఫల్యంతో బ్యాటింగ్ భారం వృద్దిమాన్ సాహా (44)పై పడింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయగా పరుగుల వేట గగనమైంది. ప్రియాం గార్గ్ (7) మరో అవకాశం సద్వినియోగం చేసుకోలేదు. అభిషేక్ శర్మ (18), అబ్దుల్ సమద్ (18)లు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు కాస్త కళ తీసుకొచ్చారు. ఆఖర్లో రషీద్ ఖాన్ (17 నాటౌట్, 13 బంతుల్లో 2 ఫోర్లు) ధనాధన్ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశాడు. జేసన్ హోల్డర్ (5) నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (0/37), దీపక్ చాహర్ (0/32) అధిక పరుగులు ఇచ్చినా..హజిల్‌వుడ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలు సన్‌రైజర్స్‌ను కట్టడి చేశారు.
ఐపీఎల్ నేటి మ్యాచ్
కోల్‌కత X పంజాబ్
వేదిక : దుబారు, సమయం : రాత్రి.7,30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..