Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ
అహ్మదాబాద్ : రిషిత్ రెడ్డి (6/34) ఆరు వికెట్ల ప్రదర్శనతో గోవాపై హైదరాబాద్ 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సీలో రిషిత్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఓపెనర్లు క్రితిక్ రెడ్డి (82), తిలక్ వర్మ (59), శశాంక్ లోకేశ్ (59) అర్థ సెంచరీలతో తొలుత హైదరాబాద్ 283/8 స్కోరు చేసింది. రిషిత్ రెడ్డి దెబ్బకు ఛేదనలో గోవా 45.3 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది.