Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ కాంస్యం సాధించింది. మెన్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో భారత్ 0-3తో పరాజయం పాలైంది. ఇరాన్‌పై 3-1తో గెలుపొందిన మెన్స్ జట్టు కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. జి సతియన్ 11-5, 10-12, 11-8, 11-5తో, శరత్ కమల్ 7-11, 15-13, 8-11, 11-9తో పరాజయం పాలయ్యారు. థారులాండ్‌పై 3-1 విజయంతో మహిళల జట్టు ఐదో స్థానం సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించటం భారత్‌కు ఇదే ప్రథమం.