Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ బ్యాటర్ అర్థ సెంచరీ
- కోల్‌కత నైట్‌రైడర్స్ 165/7
నవతెలంగాణ-దుబాయ్
యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (67, 49 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) భీకర ఫామ్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అరంగ్రేటం చేసిన అయ్యర్ పంజాబ్ కింగ్స్‌పై మరో అద్భుత అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ త్రిపాఠి (34, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రానా (31, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో పేసర్ అర్షదీప్ సింగ్ (3/32), స్పిన్నర్ రవి బిష్ణోరు (2/22) వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు.
అయ్యర్ దూకుడు : టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ (7)ను అర్షదీప్ సింగ్ కండ్లుచెదిరే బంతితో క్లీన్‌బౌల్డ్ చేయటంతో పంజాబ్ తొలి బ్రేక్ సాధించింది. కానీ వెంకటేశ్ అయ్యర్ (67) పంజాబ్‌ను ఎంతోసేపు సౌకర్యవంతంగా నిలుపలేదు. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన అయ్యర్ 39 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. రాహుల్ త్రిపాఠి తోడుగా రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. త్రిపాఠి, అయ్యర్ నిష్క్రమణతో కోల్‌కత దూకుడు కాస్త తగ్గింది. ఇయాన్ మోర్గాన్ (2), దినేశ్ కార్తీక్ (11), సీఫర్ట్ (2) విఫలమయ్యారు. నితీశ్ రానా (31) రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో కోల్‌కతకు మంచి స్కోరు అందించాడు.
ఐపీఎల్లో నేడు
ముంబయి X ఢిల్లీ
వేదిక : షార్జా , సమయం : మ.3.30
రాజస్థాన్ ఞ చెన్నై
వేదిక : అబుదాబి , సమయం : రా.7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..