Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్, స్వేచ్ఛగా ఆడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 115/8 పరుగులే చేసింది. కోల్‌కత బౌలర్లు టిమ్ సౌథీ (2/26), శివం మవి (2/29), వరుణ్ చక్రవర్తి (2/26), షకిబ్ (1/20) రాణించటంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది.
ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (0), జేసన్ రారు (10) విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26, 21 బంతుల్లో 4 ఫోర్లు), యువ బ్యాటర్ ప్రియం గార్గ్ (21, 31 బంతుల్లో 1 సిక్స్) భాగస్వామ్యం ఆశలు రేపినా.. ఇద్దరూ వికెట్ నిలుపుకోలేదు. యువ ధనాధన్ అబ్దుల్ సమద్ (25, 18 బంతుల్లో 3 సిక్స్‌లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చూడచక్కని రీతిలో మూడు సిక్సర్లు కొట్టిన సమద్ హైదరాబాద్ స్కోరు వంద పరుగులు దాటించాడు. అభిషేక్ శర్మ (6), జేసన్ హోల్డర్ (2), రషీద్ ఖాన్ (8) అంచనాలను అందుకోలేదు. భువనేశ్వర్ (7), సిద్దార్థ్ కౌల్ (7) నాటౌట్‌గా నిలిచారు. ఇక స్వల్ప ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ 10 ఓవర్లలో 44/2తో ఆడుతోంది.