Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న కోహ్లిసేన
- కింగ్స్‌పై 6 పరుగులతో ఆర్సీబీ గెలుపు
- పంజాబ్ అవకాశాలు మరింత సంక్లిష్టం
నవతెలంగాణ- షార్జా
ఐపీఎల్ 14 ప్రథమార్థంలో తిరుగులేని జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. విరామం అనంతరం ద్వితీయార్థంలో లయ అందుకునేందుకు ఇబ్బందికి లోనైంది. యుఏఈలో మూడో విజయం నమోదు చేసిన బెంగళూర్ నేరుగా ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. వరుసగా రెండోసారి బెంగళూర్ జట్టు ప్లే ఆఫ్స్‌లో ప్రవేశించింది. 164 పరుగుల స్కోరును బెంగళూర్ బౌలర్లు కాపాడుకున్నారు. మయాంక్ అగర్వాల్ (57, 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (39, 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 91 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినా.. మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. మార్కరం (20), షారుక్ ఖాన్ (16), మోయిసిస్ హెన్రిక్స్ (12) పోరాటం సరిపోలేదు. నిర్ణీత ఓవర్లలో పంజాబ్ 158 పరుగులే చేసింది. ఆరు పరుగుల తేడాతో బెంగళూర్ గెలుపొందింది. గ్లెన్ మాక్స్వెల్ (57, 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (40, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 164 పరుగులు చేసింది. 29 బంతుల్లోనే మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించిన గ్లెన్ మాక్స్వెల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
చాహల్ మాయజాలం : టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు కోల్పోయిన యుజ్వెంద్ర చాహల్ ఆ కసి ఐపీఎల్ ప్రత్యర్థులపై చూపిస్తున్నాడు!. 165 పరుగుల ఛేదనలో పంజాబ్ కింగ్స్ గెలుపు దిశగా దూసుకెళ్తోండగా.. చాహల్ మ్యాజిక్ ముందు తలొగ్గింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (57), కెఎల్ రాహుల్ (39) మరోసారి పంజాబ్‌కు తిరుగులేని ఆరంభం అందించారు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో మయాంక్ అర్థ సెంచరీ బాదగా.. రాహుల్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో సమయోచితంగా ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. షాబాబ్ ఓవర్లో రాహుల్ నిష్క్రమణతో పంజాబ్ పతనానికి నాంది పడింది. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ వరుసగా మయాంక్ అగర్వాల్, మార్కరం (20), సర్ఫరాజ్ ఖాన్ (0)లను వెనక్కి పంపించి బెంగళూర్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. 99/1తో పటిష్టంగా కనిపించిన పంజాబ్ చాహల్ దెబ్బకు పరుగుల వేటలో వెనుకంజ వేసింది. ఆఖరు ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే పంజాబ్ ఓటమి ఖరారైంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 158 పరుగులే చేసింది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు ఆవిరి చేసుకుంది.
మాక్స్వెల్ ధనాధన్ : టాప్ ఆర్డర్లో ప్రధాన బ్యాటర్ల మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 164 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (25, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (40, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. నం.3 బ్యాటర్ డాన్ క్రిస్టియన్ (0) తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా నిష్క్రమించాడు. దేవదత్ సైతం ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. 73/3తో ఉన్న బెంగళూర్‌ను గ్లెన్ మాక్స్వెల్ దూకుడుగా నడిపించాడు. సహజ శైలిలో చెలరేగిన మాక్స్వెల్ నాలుగు సిక్సర్లతో విశ్వ రూపం చూపించాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన మాక్స్వెల్ ఆఖరు ఓవర్లో నిష్క్రమించాడు. ఏబీ డివిలియర్స్ (23, 18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) అలరించాడు. నలుగురు ప్రధాన బ్యాటర్లు రాణించగా బెంగళూర్ సులువుగానే మంచి స్కోరు నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి, మెయిసిస్ హెన్రిక్స్ చెరో మూడు వికెట్లతో రాణించారు.
బెంగళూర్ : కోహ్లి (బి) హెన్రిక్స్ 25, పడిక్కల్ (సి) రాహుల్ (బి) హెన్రిక్స్ 40, క్రిస్టియన్ (సి) షారుక్ (బి) హెన్రిక్స్ 0, మాక్స్వెల్ (సి) షారుక్ (బి) షమి 57, డివిలియర్స్ రనౌట్ 23, షాబాజ్ (బి) షమి 8, భరత్ నాటౌట్ 0, గార్టన్ (బి) షమి 0, హర్షల్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-68, 2-68, 3-73, 4-146, 5-157, 6-163, 7-163.
బౌలింగ్ : మార్కరం 1-0-5-0, షమి 4-0-39-3, అర్షదీప్ 3-0-42-0, బిష్ణోరు 4-0-35-0, బరార్ 4-0-26-0, హెన్రిక్స్ 4-0-12-3.
పంజాబ్ : రాహుల్ (సి) పటేల్ (బి) షాబాజ్ 39, మయాంక్ (సి) సిరాజ్ (బి) చాహల్ 57, పూరన్ (సి) పడిక్కల్ (బి) చాహల్ 3, మార్కరం (సి) క్రిస్టియన్ (బి) గార్టన్ 20, సర్ఫరాజ్ (బి) చాహల్ 0, షారుక్ రనౌట్ 16, హెన్రిక్స్ నాటౌట్ 12, బరార్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158.
వికెట్ల పతనం : 1-91, 2-99, 3-114, 4-121, 5-127, 6-146.
బౌలింగ్ : సిరాజ్ 4-0-33-0, గార్టన్ 4-0-27-1, షాబాజ్ 3-0-29-1, హర్షల్ 4-0-27-0, చాహల్ 4-0-29-3, క్రిస్టియన్ 1-0-11-0.
ఐపీఎల్లో నేడు
చెన్నై X ఢిల్లీ
వేదిక : దుబాయ్
సమయం : రాత్రి 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం