Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరత్, మానవ్ జోడీలకు కాంస్యాలు
- ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్
దోహా (ఖతార్) : ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మరో రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. పురుషుల జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత్.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలో మరో రెండు పతకాలు కొల్లగొట్టింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి చేరుకుని చరిత్ర సృష్టించిన అచంట శరత్ కమల్.. మెన్స్ డబుల్స్‌లో ఆ జోరు చూపించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జి.సతియన్ జంటగా సెమీఫైనల్లో ఓడినా కాంస్య పతకం దక్కించుకున్నాడు. జపాన్ జోడీ యుకియా, టొగామిలు 11-5, 11-9, 13-11తో శరత్, సతియన్లపై గెలుపొందారు. మరో సెమీఫైనల్లో హర్మీత్, మానవ్ ఠక్కర్ జోడీ పోరాడి ఓడింది. సెమీస్‌లో దక్షిణ కొరియా జోడీ జాంగ్, లిమ్లతో 4-11, 6-11, 12-10, 11-9, 8-11తో ఐదు గేముల మ్యాచ్‌లో ఓటమి చెందారు. ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌ను భారత్ గొప్పగా ముగించింది. మహిళల జట్టు ఐదో స్థానంలో నిలువగా.. మెన్స్ జట్టు మూడు కాంస్య పతకాలు అందించింది.