Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా జరుగనున్న 37వ జాతీయ హ్యాండ్‌బాల్ సబ్ జూనియర్ (బాలురు) చాంపియన్‌షిప్స్ బ్రోచర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్ 7-11 వరకు సరూర్ నగర్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్‌లో జాతీయ టోర్నీ నిర్వహించనున్నారు. 'జాతీయ టోర్నీకి 29 రాష్ట్రాల నుంచి జట్లు వస్తున్నాయి. ఆరంభ వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముగింపు వేడుకలకు ఎమ్మెల్సీ కె. కవిత ముఖ్య అతిథులుగా రానున్నారు' అని జగన్మోహన్ రావు తెలిపారు.