Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయితో నేడు కీలక పోరు
షార్జా : ఐపీఎల్ లీగ్ దశ ముగింపులో నాకౌట్ వాతావరణం వచ్చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో పోటీపడుతున్న రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ నేడు కీలక ముఖాముఖి పోరులో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో 12 మ్యాచుల్లో పదేసి పాయింట్లతో రాయల్స్, ముంబయిలు వరుసగా 6,7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాయల్స్ నెట్ రన్‌రేట్ -0.337 కాగా, ముంబయి -0.453తో మరింత వెనుకంజలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం ప్లే ఆఫ్స్ రేసులో ముందంజకు తోడ్పడనుంది. దీంతో ముంబయి, రాజస్థాన్ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి హ్యాట్రిక్ టైటిళ్లపై గురి పెట్టిన ముంబయి.. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది. సూపర్‌కింగ్స్‌పై అదిరిపోయే విజయం సాధించిన రాజస్థాన్ అదే జోరు చూపించాలని అనుకుంటోంది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, శివం దూబె సహా కెప్టెన్ సంజు శాంసన్‌లు రాయల్స్‌ను ఫేవరేట్‌గా నిలుపుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య వైఫల్యాలతో ముంబయి ఈ సీజన్లో నిరాశపరిచింది. సీజన్ చివర్లోనైనా ముంబయి స్టార్స్ మెరిస్తే అది అంతిమంగా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఉపయుక్తం కానుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐపీఎల్లో నేడు
ముంబయి X రాజస్థాన్
వేదిక : షార్జా, సమయం : రాత్రి: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..