Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : అంతర్జాతీయ అరంగ్రేటం నాటి నుంచి భారత మహిళల క్రికెట్లో స్మృతీ మంధాన తనదైన ముద్ర వేసింది. మూడు ఫార్మాట్లలోనూ చిరస్మరణీయ ప్రదర్శనలతో జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. 25 ఏండ్ల మంధానకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించటం ఉత్తమమని మాజీ చీఫ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. 'నాయకత్వానికి వయసుతో సంబంధం లేదు. కానీ మంధాన కెప్టెన్ కావాలని అనిపిస్తుంది. మంధాన ఆటను బాగా చదవగలను, కొన్నేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతోంది. యువ క్రికెటర్‌కు కెప్టెన్సీ ఇవ్వటం మంచిది, అప్పుడే వాళ్లు కొన్నేండ్లు జట్టుకు నాయకత్వం వహించగలరు. రానున్న వరల్డ్‌కప్ ఫలితంతో సంబంధం లేకుండా మంధానకు కెప్టెన్సీ ఇవ్వాలి' అని రామన్ తెలిపారు. 38 ఏండ్ల మిథాలీరాజ్ టెస్టు, వన్డే జట్లకు నాయకత్వం వహిస్తుండగా.. 32 ఏండ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 సారథ్యం వహిస్తోంది. రామన్ చీఫ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే టీమ్ ఇండియా 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకుంది.