Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
ఓస్లో (నార్వే): భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. యూరోపియన్ జూనియర్ చాంపియన్ సోలోమియపై సెమీఫైనల్లో 11-0తో గెలుపొందిన అన్షు మాలిక్ నేడు పసిడి పోరులో బరిలోకి దిగనుంది. మహిళల 57 కేజీల విభాగంలో అన్షు తొలుత కజకిస్తాన్ రెజ్లర్ నిలుఫర్, క్వార్టర్స్‌లో మంగోలియా రెజ్లర్‌పై 5-1తో గెలుపొందింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లిండా మోరాయిస్ను మట్టికరిపించిన సరిత మోర్ ఫైనల్స్‌కు చేరుకోలేదు. మహిళల 59 కేజీల విభాగంలో సరిత 8-2తో కెనడా రెజ్లర్ లిండాపై ఘన విజయం సాధించినా.. సెమీస్‌లో అనూహ్య పరాజయం చవి చూసింది. తొలి రౌండ్లోనే అద్భుత టేక్‌డౌన్‌తో సరిత 7-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.