Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్ జట్టుపై ప్రసాద్
ముంబయి: ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా జట్టులో ఓ పేసర్ తక్కువయ్యాడని సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ' టీ20 ప్రపంచకప్‌కు జట్టు బాగుంది. కానీ జట్టులో ఓ పేసర్ తక్కువయ్యాడని నా భావన. భారత్ మ్యాచులు దుబారు, అబుదాబిలోనే ఎక్కువున్నాయి. ఈ పిచ్‌లు స్పిన్ కంటే పేస్‌కు అనుకూలం. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ అదే చూస్తున్నాం. షార్జాలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే, ఈ కూర్పు సరిపోతుంది. దుబారు, అబుదాబిలకు మరో పేసర్ ఉంటే బాగుండేది. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయక పోవటం సైతం ఓ సమస్య. జట్టులోకి అతడు ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. బౌలింగ్ చేయకుండా తుది జట్టులో నిలిస్తే అది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, బోర్డుకు హార్దిక్ విషయంలో ఓ స్పష్టత ఉండే ఉంటుంది. అతడిని ప్రపంచకప్‌లోనే బౌలింగ్ చేయించాలనే ఉద్దేశంతో ఐపీఎల్లో నిలువరించానే విషయం మనకు తెలియదు. కారణం ఏదైనా ఉండొచ్చు' అని ప్రసాద్ అభిప్రాయ పడ్డారు.