Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆసీస్ తొలి టీ20 నేడు
- మ. 2.10 నుంచి సోనీనెట్వర్క్లో..
గోల్డ్‌కోస్ట్: మహిళల క్రికెట్లో అత్యంత బలమైన జట్టు ఆస్ట్రేలియా. ఏ ఫార్మాట్లోనైనా భారత్ కంటే మెరుగైన జట్టు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా ఊరట విజయాలు సాధించినా మంచి ప్రదర్శనే అనే అంచనాలు. కంగారూ గడ్డపై తొలి వన్డే మినహా.. టీమ్ ఇండియా అద్భుతంగా రాణించింది. రెండో వన్డేలో అనూహ్య నో బాల్ లేకపోతే సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగేది. చివరి వన్డేలో చిరస్మరణీయ విజయం సాధించిన అమ్మాయిలు.. ఏకైక పింక్ బాల్ టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచారు. బ్యాట్‌తో, బంతితో కండ్లుచెదిరే ప్రదర్శన గావించారు. మూడు ఫార్మాట్ల సిరీస్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. వన్డే, టెస్టులు ముగియగా నేటి నుంచి టీ20 సవాల్ ఆరంభం. భారత్, ఆస్ట్రేలియాలు నేడు తొలి టీ20లో తలపడనున్నాయి.
స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయంతో వన్డే, టెస్టుల్లో ఆడలేదు. టీ20ల్లో హర్మన్‌ప్రీత్ జట్టుకు నాయకత్వం వహించనుంది. చివరి వన్డే, టెస్టులో రాణించిన బ్యాటర్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. విధ్వంసక హర్మన్‌ప్రీత్ చేరికతో భారత బ్యాటింగ్ బలం అమాంతం పెరిగింది. షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన, యస్టికా భాటియా, స్నేV్‌ా రానా, రిచా ఘోష్‌లు భారత్‌కు కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారత్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా నిలువనుంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం టీ20 సిరీస్‌ను ఫేవరేట్‌గా మొదలుపెడుతోంది. 6-4తో ఆసీస్ జట్టు సిరీస్‌లో ముందుంది. మూడు మ్యాచుల్లో ఒక్కటి నెగ్గినా ఆసీస్ సిరీస్‌ను కోల్పోని స్థితిలో నిలువనుంది. సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ మూడింటా గెలుపొందాల్సి ఉంది.