Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన యువ బ్యాటర్
- ఆసీస్‌తో తొలి టీ20 వర్షార్పణం
గోల్డ్‌కోస్ట్ : భారత్, ఆస్ట్రేలియా (మహిళలు) తొలి టీ20 వర్షార్పణం. భారత ఇన్నింగ్స్ మధ్యలోనే వరుణుడు రంగ ప్రవేశం చేయటంతో ఆట పున ప్రారంభం సాధ్యపడలేదు. దీంతో భారత్, ఆస్ట్రేలియాలు చెరో పాయింట్ పంచుకున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 7-5తో ముందంజలో కొనసాగుతోంది. శనివారం రెండో వన్డే జరుగనుంది. టాస్ నెగ్గి తొలుత ఫీల్గింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత బ్యాటర్లు అదిరే పంచ్ ఇచ్చారు. ఆది నుంచీ దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్ గ్యాంగ్ 170-180 పరుగుల భారీ స్కోరు దిశగా సాగింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు స్మృతీ మంధాన (17, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలీ వర్మ (18, 14 బంతుల్లో 3 సిక్స్‌లు)లు అదిరే ఆరంభం ఇచ్చారు. నం.3 బ్యాటర్ జెమీమా రొడ్రిగస్ (49 నాటౌట్, 36 బంతుల్లో 7 ఫోర్లు) అదరగొట్టింది. పేలవ ప్రదర్శనతో వన్డే జట్టులో చోటు కోల్పోయిన జెమీమా పొట్టి ఫార్మాట్లో సత్తా చాటింది. ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (12, 5 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్ (17 నాటౌట్, 13 బంతుల్లో 3 ఫోర్లు), యస్టికా భాటియా (15, 15 బంతుల్లో 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. టీమ్ ఇండియా 15.2 ఓవర్లలో 131/4తో సాగుతుండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.