Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : క్రికెట్ దిగ్గజం, సూపర్‌కింగ్స్ ముఖచిత్రం ఎం.ఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుంది!. ఈ మేరకు కెప్టెన్ కూల్ పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. ' వచ్చే ఏడాది నన్ను ఎల్లో జెర్సీలో చూస్తారు. కానీ నేను ఆడాతానో లేదో మీకు తెలియదు. రెండు కొత్త జట్లు వస్తున్నాయి. ఎన్నో అంశాలపై అనిశ్చితి కొనసాగుతోంది. రిటెన్షన్ నిబంధనలు తేలాల్సి ఉంది' అని పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ధోని వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో ధోనిది భావోద్వేగ బంధం. ఇప్పటికే టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టు మెంటార్‌కు వ్యవహరించనున్న మహి.. చెన్నైకీ అదే తరహా పాత్రలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్లో నేడు
హైదరాబాద్ X ముంబయి
వేదిక : షార్జా , సమయం : రా: 7.30
బెంగళూర్ X ఢిల్లీ
వేదిక : దుబాయ్ , సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..