Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయల్స్‌పై గిల్, అయ్యర్ మెరుపులు
నవతెలంగాణ-షార్జా : తప్పక నెగ్గాల్సిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ ఆకట్టుకుంది. స్వల్ప స్కోర్లు నమోదవుతూ, బ్యాటర్లకు సవాల్ విసిరిన షార్జా పిచ్‌పై కోల్‌కత ఈ సీజన్లోనే భారీ స్కోరు నమోదు చేసింది. యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (56, 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (38, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 171/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. పవర్‌ప్లేలో కోల్‌కతను కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. చివరి ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటంలో విఫలమైంది. శుభ్‌మన్, వెంకటేశ్ జోడీ తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 79 పరుగుల కీలక భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. నితీశ్ రానా (12, 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (21, 14 బంతుల్లో 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), ఇయాన్ మోర్గాన్ (13 నాటౌట్) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు కోల్‌కత 171 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్, చేతన్ సకారియ, రాహుల్ తెవాటియ, గ్లెన్ ఫిలిప్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 ఢిల్లీ 13 10 03 20
2 చెన్నై 14 09 05 18
3 బెంగళూర్ 12 08 04 16
4 కోల్‌కత 13 06 07 12
5 పంజాబ్ 14 06 08 12
6 ముంబయి 13 06 07 12
7 రాజస్థాన్ 13 05 08 10
8 హైదరాబాద్ 12 02 10 04
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు