Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒస్లో (నార్వే) : భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. మహిళల 57 కేజీల విభాగంలో పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలిచిన అన్షు మాలిక్ ఫైనల్లో అమెరికా రెజ్లర్ హెలెనా మారోలిస్ చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగిన పసిడి పోరులో మ్యాట్‌పై అన్షు మాలిక్ తడబడింది. తొలి రౌండ్లో ఓ పాయింట్ సాధించిన అన్షు మాలిక్.. రెండో రౌండ్లో ప్రత్యర్థి పట్టుకు చిక్కింది. హెలెనాకు చిక్కకుండా అన్షు తెలివిగా ఆడినా.. హెలెనా ఫాల్‌తో పసిడిని ఎగరేసుకు పోయింది. రెండో రౌండ్లో అన్షు మాలిక్ రెండు భుజాలను మ్యాట్‌కు అదిమిపట్టిన హెలెనా ఈ విభాగంలో పసిడి పతకం సాధించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన 20 ఏండ్ల అన్షు మాలిక్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు వచ్చిన తొలి రజతం ఇదే కావటం విశేషం