Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సబ్‌జూనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీ
నవతెలంగాణ, హైదరాబాద్ : 37వ జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 32-11తో మధ్యప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది. ప్రథమార్థంలో 18-6తో తిరుగులేని ఆధిక్యం సాధించి.. ద్వితీయార్థంలో ఆధిక్యం మరిం త పెంచుకుంది. 23-11తో ఆంధ్రప్రదేశ్ జట్టు జార్ఖండ్‌పై గెలుపొందింది. ఉత్తరఖండ్ 22-8తో ఒడిశాపై, హర్యానా 31-16తో చంఢగీడ్పై, బిహార్ 28-8తో బెంగాల్‌పై విజయాలు సాధించాయి.