Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా
కరాచీ : న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక సంక్షోభం ముంగిట నిలిచింది. భద్రతా కారణాల రీత్యా ఏ జట్టు పాక్‌లో పర్యటించేందుకు సముఖంగా లేదు. ఈ పరిస్థితుల్లో పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భారత్‌ను విమర్శించే పనిలో పడ్డాడు!. ' పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ నిధుల రూపంలో వస్తున్నాయి. ఐసీసీ టోర్నీల నిర్వహణతో ఆదాయాన్ని సభ్య దేశాలకు పంచుతుంది. ఐసీసీ ఆదాయంలో 90 శాతం భారత మార్కెట్ నుంచి వస్తుంది. మరో మాటలో భారత బిజినెస్ హౌస్‌లు పాక్ క్రికెట్‌ను నడుపుతున్నాయి. రేపు భారత ప్రధాని పాకిస్థాన్ క్రికెట్‌కు నిధులు ఆపాలని అనుకుంటే.. అక్కడితో పాక్ క్రికెట్ కుప్పకూలేందుకు అవకాశం ఉంది' అని రమీజ్ రాజా అన్నాడు. బిగ్3 దేశాలుగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు పిలువబడుతున్నా.. నిజానికి భారత్ చేరువలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు లేవని రాజా అన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం న్యూజిలాండ్‌కు ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకు రెండు నిమిషాల్లో బ్యాగులు సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోయిందని రాజా వాపోయాడు.