Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆసీస్ రెండో టీ20 నేడు
గోల్డ్‌కోస్ట్ : భారత్, ఆస్ట్రేలియా (మహిళలు) నేడు రెండో టీ20లో తలపడనున్నాయి. వర్షంతో తొలి టీ20 రద్దు కాగా.. సిరీస్‌లో ఆధిక్యం కోసం నేడు ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మకు తోడు జెమీమా రొడ్రిగస్ ఫామ్‌లోకి రావటంతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. యువ క్రికెటర్లు జోరుమీద ఉండటంతో నేడు టీమ్ ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి టీ20లో ఆసీస్ బౌలర్లను చిత్తుగా బాదిన హర్మన్‌ప్రీత్ గ్యాంగ్ నేడూ అదే పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, ఆసీస్ రెండో టీ20 నేడు సోనీ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నాం 1.40 నుంచి ప్రసారం కానుంది.