Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన శిఖర్ ధావన్
- ఢిల్లీ క్యాపిటల్స్ 164/5
నవతెలంగాణ-దుబాయ్
నామమాత్రపు ఐపీఎల్ 14 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో అగ్ర జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో చెన్నై సూపర్‌కింగ్స్‌తో క్వాలిఫయర్ 1 సమరానికి రంగం సిద్ధం చేసుకున్న పంత్‌సేన.. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో క్వాలిఫయర్1కు ముందు సన్నాహాకంలో అదరగొట్టింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (48, 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (43, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 88 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరి మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 164/5 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (2/25), యుజ్వెంద్ర చాహల్ (1/34), హర్షల్ పటేల్ (1/34), డాన్ క్రిస్టియన్ (1/19) వికెట్లు తీసుకున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. పవర్‌ప్లేలో స్పిన్‌తో మొదలెట్టిన కోహ్లికి పృథ్వీ షా, ధావన్ పంచ్ ఇచ్చారు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో పృథ్వీ చెలరేగగా.. శిఖర్ ధావన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో దంచికొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ పోటీపడి పరుగులు చేయటంతో 10 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 88/0తో పటిష్టంగా కనిపించింది. స్వల్ప విరామంలో పృథ్వీ, ధావన్ నిష్క్రమణతో ఢిల్లీ స్కోరు వేగం నెమ్మదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (10), శ్రేయస్ అయ్యర్ (18), షిమ్రోన్ హెట్మయర్ (29, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఢిల్లీకి మంచి స్కోరు అందించారు. రిపాల్ పటేల్ (7 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 ఢిల్లీ 13 10 03 20
2 చెన్నై 14 09 05 18
3 బెంగళూర్ 13 08 05 16
4 కోల్‌కత 14 07 07 14
5 పంజాబ్ 14 06 08 12
6 ముంబయి 13 06 07 12
7 రాజస్థాన్ 14 05 09 10
8 హైదరాబాద్ 13 03 10 06
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు