Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో టి20లో భారత్ పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 118 పరుగులు మాత్రమే చేయగల్గింది. హర్మన్‌ప్రీత్ కౌర్(28), పూజ వస్త్రాకర్(37) మాత్రమే రాణించగా.. మంధాన(1), షెఫాలీ(3), రోడ్రిగ్స్(7) ఘోరంగా విఫలమయ్యారు. భారత్ 23 పరుగులకే మూడు వికెట్లు.. 81 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో చివరి వికెట్‌కు పూజ(37నాటౌట్) అజేయంగా క్రీజ్‌లో నిలిచి భారత్‌కు గౌరవప్రద స్కోర్‌కు దోహదపడింది. వ్లెమిక్స్, మోలినెక్స్కు రెండే వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆస్ట్రేలియా మహిళల జట్టులో మూనీ(34), లానింగ్(15), మెక్‌గ్రాత్(42) బ్యాటింగ్‌కు రాణించడంతో 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0లో ఆధిక్యతలో ఉండగా.. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మూడో, ఆఖరి టి20 ఆదివారం జరగనుండగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మెక్‌గ్రాత్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
భారత్ మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి)నికోలా (బి)వ్లెమినెక్ 1, షెఫాలీ (సి)డార్లింగ్టన్ (బి)వ్లెమినెక్ 3, రోడ్రిగ్స్ (సి)డార్లింగ్టన్ (బి)మోలినెక్స్ 7, హర్మన్ (స్టంప్)హీలీ (బి)వరేహన్ 28, యస్టింగ్ భాటియా (రనౌట్) వరేహమ్/హీలీ 8, రిచా ఘోష్ (బి)నికోలా 2, దీప్తి (రనౌట్) మెక్‌గ్రాత్/హీలీ 16, పూజా (నాటౌట్) 37, శిఖా పాండే (బి)గార్డెనర్ 1, రేణుక (బి)మోలినెక్స్ 1, గైక్వాడ్ (నాటౌట్) 0, అదనం 14. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 118 పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/12, 3/24, 4/50, 5/52, 6/61, 7/76, 8/78, 9/81
బౌలింగ్: వ్లెమినెక్ 3-0-18-2, మోలినెక్స్ 4-0-11-2, ఫెర్రీ 2-0-17-0, గార్డినర్ 4-0-12-1, వారేహమ్ 2-0-14-1, నికోలా 3-0-25-1, డార్లింగ్టన్ 2-0-19-0
ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్: హీలీ (బి)శిఖా పాండే 4, బెత్ మూనీ (స్టంప్) రిచా ఘోష్ (బి)గైక్వాడ్ 34, లానింగ్ (సి)రీచా (బి)గైక్వాడ్ 15, గార్డినర్ (సి)గైక్వాడ్ (బి)హర్మన్‌ప్రీత్ 1, ఫెర్రీ (సి)హర్మన్ ప్రీత్ (బి)దీప్తి 2, మెక్‌గ్రాత్ (నాటౌట్) 42, క్యారీ (స్టంప్) రిచా (బి)గైక్వాడ్ 7, వారేహమ్ (నాటౌట్) 10, అదనం 4. (19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 119 పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/35, 3/38, 4/46, 5/71, 6/94
బౌలింగ్: శిఖా పాండే 4-0-27-1, రేణుకా సింఫ్‌ు 4-1-27-0, పూజా వస్త్రాకర్ 3.1-0-21-0, గైక్వాడ్ 4-0-21-3, హర్మన్ ప్రీత్ 2-0-9-1, దీప్తి 2-0-11-1.