Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ, హైదరాబాద్ : హ్యాండ్‌బాల్ జాతీయ చాంపియన్‌గా తెలంగాణ జట్టు నిలిచింది. 37వ జాతీయ సబ్‌జూనియర్ జాతీయ చాంపియన్‌పిప్ ఉత్కంఠభరిత ఫైనల్లో రాజస్థాన్‌పై తెలంగాణ 29-26 గెలుపొందింది. సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 28-38తో రన్నరప్ రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ' కోవిడ్ మహమ్మారి అనంతరం నగరంలో జాతీయ స్థాయి టోర్నీ నిర్వహించటం అభినందనీయం. హ్యాండ్‌బాల్ టోర్నీతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ వేదికగా మరిన్ని జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలి. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది. విజేతగా నిలిచిన తెలంగాణ జట్టు, టోర్నీని విజయవంతంగా నిర్వహించిన హ్యాండ్‌బాల్ జాతీయ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ప్రత్యేక అభినందనలు' అని కవిత అన్నారు. కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి పవన్, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.