Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరు మ్యాచ్‌లో భారత్ ఓటమి
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శనతో మెరిసినా.. టీమ్ ఇండియా అమ్మాయిలకు సిరీస్ చిక్కలేదు. వన్డే సిరీస్‌ను అనూహ్యంగా 1-2తో కోల్పోయిన భారత్, ఏకైక టెస్టును డ్రా చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 150 పరుగుల ఛేదనలో హర్మన్‌ప్రీత్ సేన 135/6 పరుగులే చేసింది. ఛేదనలో స్మృతీ మంధాన (52, 49 బంతుల్లో 8 ఫోర్లు), జెమీమా రొడ్రిగస్ (23, 26 బంతుల్లో 1 ఫోర్) మెరవటంతో బారత్ 92/2తో గెలుపు దిశగా సాగింది. మంధాన నిష్క్రమణతో భారత ఆశలు ఆవిరయ్యాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), పూజ (5), హర్లీన్ డియోల్ (2) విఫలమయ్యారు. షెఫాలీ వర్మ (1) నిరాశపరిచింది. రిచా ఘోష్ (23 నాటౌట్, 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం సరిపోలేదు. బెత్ మూనీ (61, 43 బంతుల్లో 10 ఫోర్లు), తహ్లియ మెక్‌గ్రాత్ (44 నాటౌట్, 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 149/5 పరుగులు చేసింది. అలిసా హీలీ (4), ఆష్లె (1), ఎలిసీ పెర్రీ (8) విఫలమయ్యారు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. చివరి రెండు టీ20ల్లో ఆసీస్ గెలుపొందింది. మల్టీ ఫార్మాట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 11-5తో ముగించింది. తహ్లియ మెక్‌గ్రాత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను సొంతం చేసుకుంది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా :149/5 (బెత్ మూనీ 61, తహ్లియ 44, రాజేశ్వరి 2/37, పూజ 1/24)
భారత్ :135/6 (స్మృతీ మంధాన, జెమీమా 23, రిచా 23, నికోల కేరీ 2/42)