Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- రాణించిన షిమ్రోన్ హెట్మయర్
- ఢిల్లీ క్యాపిటల్స్ 172/5ఢిల్లీ క్యాపిటల్స్ 172/5
నవతెలంగాణ-దుబాయ్
చెన్నై సూపర్‌కింగ్స్‌తో క్వాలిఫయర్1 పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. యువ బ్యాటర్లు పృథ్వీ షా (60, 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషబ్ పంత్ (51 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. షిమ్రోన్ హెట్మయర్ (37, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురు యువ బ్యాట్స్‌మెన్ జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్ దుబారు పిచ్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 172/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. అక్షర్ పటేల్ (10)ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపి చేసిన ప్రయోగం విఫలమైంది. శిఖర్ ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1) విఫలమయ్యారు. ఇక భారీ ఛేదనలో చెన్నై సూపర్‌కింగ్స్ దూసుకుపోతుంది!. 11 ఓవర్లలో సూపర్‌కింగ్స్ 94/1తో ఆడుతోంది. డుప్లెసిస్ (1) విఫలమైనా.. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యంతో అదరగొట్టారు!.
పృథీ, పంత్ మెరుపుల్ : యువ బ్యాటర్ పృథ్వీ షా (60, 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దుబారులో దుమ్మురేపాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన పృథ్వీ షా 27 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగిన ఢిల్లీ ఓపెనర్ పవర్‌ప్లేలో క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం అందించాడు. ఆరంభంలో పృథ్వీ షా హీరోయిక్స్.. చివర్లో రిషబ్ పంత్ (51 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ దుబారు పిచ్‌పై ఛేదనకు మొగ్గుచూపింది. పృథ్వీ షా చెలరేగినా.. మరో ఎండ్‌లో అతడికి సహకారం దక్కలేదు. శిఖర్ ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1), అక్షర్ పటేల్ (10) విఫలమయ్యారు. దీంతో పృథ్వీ ఒక్కడే తొలి పది ఓవర్లలో చెన్నై పని పట్టాడు. కీలక వికెట్లు కోల్పోవటం, లోయర్ ఆర్డర్లో బ్యాటర్లు లేకపోవటంతో రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మయర్ (37, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 83 పరుగులు జోడించింది. శార్దుల్ ఠాకూర్ స్లో బౌన్సర్‌ను పంత్ సిక్సర్‌గా మలిచి అలరించాడు. చివరి ఓవర్లో శార్దుల్ ఠాకూర్ పరుగుల కట్టడితో ఢిల్లీ 172 పరుగులే చేసింది. చివరి మూడు బంతుల్లో 4, 2, 2తో పంత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో జోశ్ హజిల్‌వుడ్ (2/29) రెండు వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా (1/23), మోయిన్ అలీ (1/27), డ్వేన్ బ్రావో (1/31) రాణించారు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60, శిఖర్ ధావన్ (సి) ధోని (బి) హజిల్‌వుడ్ 7, శ్రేయస్ అయ్యర్ (సి) రుతురాజ్ (బి) హజిల్‌వుడ్ 1, అక్షర్ పటేల్ (సి) శాంట్నర్ (బి) మోయిన్ అలీ 10, రిషబ్ పంత్ నాటౌట్ 51, షిమ్రోన్ హెట్మయర్ (సి) జడేజా (బి) బ్రావో 37, టామ్ కరన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు :06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం : 1-36, 2-50, 3-77, 4-80, 5-163.
బౌలింగ్ : దీపక్ చాహర్ 3-0-26-0, జోశ్ హజిల్‌వుడ్ 4-0-29-2, శార్దుల్ ఠాకూర్ 3-0-36-0, రవీంద్ర జడేజా 3-0-23-1, మోయిన్ అలీ 4-0-27-1, డ్వేన్ బ్రావో 3-0-31-1.