Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లి
షార్జా : ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో మరింత ఒత్తిడి సృష్టించేందు కోసమే క్వాలిఫయర్స్, ఎలిమినేటర్లను తీసుకొచ్చారని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తొలి రెండు స్థానాల్లో నిలువగా.. బెంగళూర్ మూడో స్థానం సాధించింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌కు ముందు విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'మా జట్టుపై అపార నమ్మకం ఉంది. టాప్-2లో నిలువలేకపోతే ఫైనల్స్‌కు చేరేందుకు మరో రెండు మ్యాచుల్లో నెగ్గాల్సి ఉంటుంది. అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. అన్ని రకాల పరిస్థితులకు సంసిద్ధంగా ఉన్నాం. మరింత ఒత్తిడి పెంచటం కోసమే క్వాలిఫయర్స్, ఎలిమినేటర్లను ప్రవేశపెట్టారని నా భావన. క్రికెట్ ఆడినప్పుడు మనం గెలవచ్చు, ఓడవచ్చు. కానీ గెలుపుతో పాటు ఓటమి సైతం ఓ ఆప్షన్ అయినప్పుడు ఆలోచన దృక్పథం నెగెటివ్‌గా మారుతుంది. ఓటమి ఓ అప్షన్ కానప్పుడే ఆట అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది' అని విరాట్ తెలిపాడు.