Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5-0తో భారత్ ఘన విజయం
- థామస్ కప్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ : థామస్ కప్‌లో టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో మెన్స్ జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది. గ్రూప్-సి తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. ఐదు మ్యాచుల్లోనూ భారత షట్లర్లు సాధికారిక విజయాలు నమోదు చేయటంతో 5-0తో గెలుపొందింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-12, 21-14తో జోరెన్పై విజయం సాధించాడు. తొలి డబుల్స్ పోరులో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 21-19, 21-12తో రూబెన్, వాండెర్లపై గెలుపొందారు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత బి. సాయిప్రణీత్ రెండో సింగిల్స్‌లో సూపర్ విజయం సాధించాడు. 21-4, 21-12తో 27 నిమిషాల్లోనే లాంఛనం ముగించాడు. రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల 21-12, 21-13తో గెలుపొందారు. మూడో సింగిల్స్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 21-6, 21-11తో గెలుపొంది భారత్‌కు క్లీన్‌స్వీప్ విజయాన్ని అందించాడు. నేడు గ్రూప్-సి మరో మ్యాచ్‌లో తహిటితో భారత్ తలపడనుంది. మహిళల విభాగంలో (ఉబెర్ కప్) భారత్ తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-2తో గెలుపొందింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గేమ్ నడుమే నిష్క్రమించినా.. యువ షట్లర్లు విజయాన్ని అందించారు. నేడు గ్రూప్-బిలో అమ్మాయిలు స్కాట్లాండ్తో తలపడనున్నారు.