Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· అక్టోబర్ 24 చారిత్రాత్మక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో టీ20 పెవిలియన్ వద్ద గడిపే అవకాశం
· టీ20 పెవిలియన్ వినూత్నమైనది. క్రికెట్ నేపథ్యంతో తీర్చిదిద్దిన విలాస వసతి. బుకింగ్ డాట్ కామ్, ముంబైలోని గ్రాండ్ హయత్ ముంబై హోటల్ అండ్ రెసిడెన్స్‌లో ప్రత్యేకంగా ఈ ప్రెసిడెన్షియల్ సూట్ తీర్చిదిద్దింది. ఇది క్రికెట్ అభిమానులకు హౌజాట్ ! అనుభూతులను అందించనుంది
· అదృష్టవంతులైన అభిమానులు టీ20 పెవిలియన్ సూట్ వద్ద ప్రత్యక్ష యాక్షన్ ఆస్వాదించడంతో పాటుగా సుప్రసిద్ధ బాలీవుడ్ తార శ్రద్ధా కపూర్‌ను సైతం కలుసుకునే అవకాశం పొందగలరు.
· ద టీ20 పెవిలియన్ వద్ద మీ వసతిని 16 అక్టోబర్ 2021 సాయంత్రం భారతీయ కాలమానం 4.30 గంటలు నుంచి ప్రత్యేకంగా బుకింగ్ డాట్ కామ్ వెబ్సైట్, మొబైల్ యాప్ వద్ద బుక్ చేసుకోండి. మీ క్యాలెండర్స్‌లో తగిన ఏర్పాట్లు చేసుకోండి !
హైదరాబాద్: ఫ్యాంటసీ లీగ్స్ కోసం సంతకాలు చేయడం మొదలు, తమ ఇళ్లలో జ్ఞాపికలను వరుసగా నిలువడం నుంచి మ్యాచ్‌కు నెలల ముందుగానే తమ టిక్కెట్లను ముందుగా బుకింగ్ చేసుకోవడం వరకూ భారతదేశపు అతిపెద్ద క్రికెట్ అభిమానులు ఈ క్రీడకు చేయనిదంటూ ఏమీ ఉండదు. భారతీయ క్రికెట్ ప్రేమికులకు మరింత ఉత్కంఠభరితంగా మలిచే అంశం, ఇండియా మరియు పాకిస్తాన్ నడుమ మ్యాచ్‌కు మించి ఏమైనా ఉంటుందా ? అత్యుత్తమ క్రికెట్ అనుభవాలను, అత్యుత్తమ క్రికెట్ అభిమానులకు తీసుకువస్తూ, విస్తృతశ్రేణిలో వినూత్నమైన ప్రదేశాలతో యాత్రికులను అనుసంధానించడంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందడంతో పాటుగా ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ కోసం వసతి బుకింగ్ పార్టనర్‌గా వెలుగొందుతున్న బుకింగ్ డాట్‌కామ్ ఇప్పుడు క్రికెట్ అభిమానులు మరియు వారి కుటుంబ సభ్యులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను ‘ద టీ20 పెవిలియన్ – యాన్ అల్టిమేట్ క్రికెట్ స్టే ఇండియా’వద్ద వీక్షిస్తూ రాజరికపు వైభవాన్ని ఆస్వాదించాల్సిగా ఆహ్వానిస్తుంది. అంతేనా, ఇది ఇక్కడితో ముగియదు, ఈ అనుభవంలో భాగంగా అతిథులకు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను టీ20 పెవిలియన్ వద్ద కలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది.
కేవలం ఒక్క రాత్రికి మాత్రమే లభ్యమయ్యే టీ20 పెవిలియన్ , గ్రాండ్ హయత్ ముంబై హోటల్ అండ్ రెసిడెన్స్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్‌ను క్లాసిక్ క్రికెట్ స్టేడియంగా మార్చడంతో పాటుగా అతిథులకు లీనమయ్యే, జీవితకాలంలో ఒక మారు అనతగ్గ అనుభవాలను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే అక్టోబర్ 24,2021న అందించనుంది. అతిథులు టీ20 పెవిలియన్ లోపలకు ప్రవేశించినంతనే గర్జనలతో నిండిన స్టేడియం శక్తిలో లీనం కావడంతో పాటుగా స్టేడియంలో ఎలాగైతే లగ్జరీ బాక్స్ సీట్లు ఉంటాయో, అదే తరహా సౌకర్యవంతమైన సోఫాలలో ఆశీనులై భారీ స్ర్కీన్‌పై ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను తిలకించవచ్చు. వ్యక్తిగతీకరించిన క్రికెట్ జెర్సీలను అతిథులు ధరించడం మాత్రమే కాదు, ఫోమ్ ఫింగర్స్, ఫ్లాగ్స్, విజిల్స్‌తో తమ ఆనందాన్ని బాల్ బౌండరీ తరలి వెళ్లినప్పుడల్లా లేదంటే అద్భుతమైన క్యాచ్ కోసం బౌలర్ చేసినప్పుడు వ్యక్తీకరించవచ్చు. ఒకవేళ ఈ ఆనందం నియంత్రించుకోవడం కష్టసాధ్యంగా ఉందనుకుంటే, కొంత సమయం తీసుకుని ఫీల్డ్‌కు పక్కనే ఉన్నటువంటి లాకర్ రూమ్‌కు వెళ్లి ఎనర్జీ డ్రింక్స్‌తో పునరుత్తేజం పొందవచ్చు లేదా బెడ్రూమ్కు నెట్ ప్రాక్టీస్ కోసం వెళ్లడం మరియు మీ స్క్వాడ్ తో కొన్ని సలహాలు, ట్రిక్స్‌ను సైతం చర్చించవచ్చు.
భారతదేశపు అసాధారణ క్రికెట్ అభిమానులు క్రికెట్ నేపథ్యంగా కలిగిన స్నాక్స్, మాక్టైల్స్ వంటి హిట్ వికెట్, సూపర్ సిక్సర్, బౌల్డ్ ఓవర్లను వ్యక్తిగత బట్లర్లు వారి గదికి తీసుకురావడంతో ఆస్వాదించవచ్చు. ఉత్కంఠభరితమైన క్షణాలను ఆస్వాదించడంతో పాటుగా సంతోషపు అరుపులు , తమ అభిమాన క్రికెటర్లకు అభినందనలు తెలిపిన తరువాత రోజు ఉదయం అతిథులు అత్యంత రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను కేఫ్ వద్ద ఆస్వాదించి చెక్ఔట్ కావొచ్చు. ప్రతి అంశంలోనూ క్రికెట్ నింపడం ద్వారా అత్యంత అందంగా తీర్చిదిద్దిన ఈ టు బెడ్ రూమ్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను బ్యాట్లు, హెల్మెట్లు, స్టంపులు, సీజనల్ బాల్స్ వంటి జ్ఞాపికలతో అలంకరించడం వల్ల ప్రతి క్రికెట్ అభిమాని ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిన అంశంగా నిలుస్తుంది ! అందువల్ల మీ లెగ్ కార్డ్స్ కట్టండి, మీ హెల్మెట్ ధరించండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మీ గ్లవ్స్ ధరించండి, మీ జీవితంలో ఒక్కమారనిపించే క్రికెట్ వసతికి సిద్ధమవండి !
బుకింగ్ డాట్ కామ్ రీజనల్ మేనేజర్–సౌత్ ఆసియా, రీతు మెహరోత్రా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో క్రికెట్ అనేది ఓ క్రీడ మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. దేశాన్ని ఇది ఏకతాటిపై నిలుపుతుంది. ఓ డిజిటల్ ట్రావెల్ లీడర్‌గా ప్రజలు ఈ ప్రపంచాన్ని అత్యంత సులభంగా ఆస్వాదించే అవకాశం కల్పిస్తూ టీ20 పెవిలియన్‌ను ఉత్సాహపూరితమైన, జీవితానికి ఒక్కమారనుతగ్గ అనుభవాలను భారతీయులకు తీసుకురావడంతో పాటుగా ముంబైలోని ఓ హోటల్ సూట్ లగ్జరీ నుంచి ఒక రాత్రి క్రికెట్ స్టేడియం శక్తి, ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. టీ20 పెవిలియన్ ప్రతి క్రికెట్ వీరాభిమానికీ క్రికెట్ ప్రపంచపు అనుభూతులను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం అందిస్తుంది. ఈ వసతి వారికి మరిచిపోలేనట్టి రీతిలో పిచ్ ఆవలి జ్ఞాపకాలను అందించడంతో పాటుగా అభిమానులకు అనుభవాలనూ అందిస్తుంది. బుకింగ్ డాట్ కామ్ అంటేనే వినూత్న అనుభవాల సమ్మేళనం’’ అని అన్నారు.
ఈ వినూత్న అనుభవంలో భాగం కావడం పట్ల తన ఆనందాన్ని బాలీవుడ్ నటి, క్రికెట్‌కు వీరాభిమాని అయిన శ్రద్ధా కపూర్ వ్యక్తీకరిస్తూ ‘‘ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ కోసం బుకింగ్ డాట్ కామ్ సృష్టించిన ఈ వినూత్నమైన వసతి, అనుభవాలలో నేను కూడా ఓ భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా క్రికెట్ ఎల్లప్పుడూ ఉంటుంది. నా కుటుంబంతో కలిసి ఈ క్రీడను వీక్షించడాన్ని నేను అమితంగా అభిమానిస్తుంటాను. మా కుటుంబ సభ్యులతో మరింత సమయం ఆస్వాదించే అద్భుత అవకాశాన్ని ఇది నాకు అందిస్తుంది. భారతదేశపు అదృష్టవంతులైన, అతి పెద్ద క్రికెట్ అభిమానులతో ఈ అనుభవాలను సొంతం చేసుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.
ఒక్క రాత్రి మాత్రమే గడిపేందేకు ఈ టీ20 పెవిలియన్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. 24 అక్టోబర్ 2021న చెక్ ఇన్ అయితే 25 అక్టోబర్ 2021 చెకవుట్ కావాల్సి ఉంటుంది. ఈ టీ20 పెవిలియన్ ధర 6666/– రూపాయలు మాత్రమే. టీ20 వరల్డ్‌కప్‌లో కనిపించే అద్భుతమైన సిక్స్‌లకు నివాళిగా ఈ ధరను నిర్ణయించారు. టీ20 పెవిలియన్ వద్ద వసతిని క్రికెట్ అభిమానులు బుకింగ్ డాట్ కామ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌పై అక్టోబర్ 16 శనివారం, భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. ముందు వచ్చిన వారికి ముందుపద్ధతిలో ఈ బుకింగ్ జరుగుతుంది. ఈ బుకింగ్ డాట్ కామ్ టీ20 పెవిలియన్‌పై గరిష్టంగా నలుగురు అతిథులు మాత్రమే బుక్ చేసుకోగలరు. ఈ క్రికెట్ స్ఫూర్తి కలిగిన వసతి కోసం అతిథులు బుకింగ్ డాట్ కామ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను చూడవచ్చు. పైన పేర్కొన్న షెడ్యూల్స్కు ముందుగా అంటే 16 అక్టోబర్ కు ముందుగా ఈ రూమ్స్ బుకింగ్స్ డాట్ కామ్ వెబ్సైట్, యాప్పైూ ‘సోల్డ్ అవుట్’ లేదా ‘నాట్ ఎవైలబుల్’ గా చూపుతాయి. పూర్తిగా వ్యాక్సిన్లు వేయింకుచుకున్న అతిథులకు మాత్రమే వసతి కోసం బుకింగ్స్ తెరిచి ఉంచబడతాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతటా, అవసరమైన కోవిడ్–19 మార్గదర్శకాలు, మరియు ప్రభుత్వ సూచనలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండవలసి ఉంటుంది.