Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0-5తో భారత్ పరాజయం
- ఉబెర్ కప్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ : ఉబెర్ కప్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించినా.. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా అమ్మాయిలు దారుణంగా నిరాశపరిచారు. బలమైన థారులాండ్‌తో తలపడిన భారత్ ఐదు మ్యాచుల్లోనూ పరాజయం చవిచూసింది. థారులాండ్‌పై భారత అమ్మాయిలు కేవలం ఒకే ఒక్క గేమ్‌ను గెలుపొందారు. తొలి సింగిల్స్‌లో మాలవిక 15-21, 11-21తో పోర్నపవీ చేతిలో, రెండో సింగిల్స్‌లో అదితి భట్ 16-21, 21-18, 15-21తో బుసానన్ చేతిలో, మూడో సింగిల్స్‌లో టస్నీమ్ మిర్ 19-21, 15-21తో సుపనిడ చేతిలో పరాజయాలు పొందారు. డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 16-21, 12-21తో, ట్రెస్సీ, గాయత్రి జోడీ 17-21, 16-21తో నిరాశపరిచారు. 0-5తో థారులాండ్ చేతిలో ఓటమి చెందిన భారత్ గ్రూప్-బిలో రెండో స్థానంలో క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. గాయం కారణంగా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ థారులాండ్‌తో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు.