Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా క్రికెటర్లు ధరించే జెర్సీని బీసీసీఐ, అధికారిక కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ బుధవారం ఆవిష్కరించాయి. అభిమానుల నుంచి స్ఫూర్తితో రూపొందించిన తొలి జెర్సీకి 'బిలియన్ చీర్స్ జెర్సీ'గా నామకరణం చేశారు. భారత జట్టు చారిత్రక విజయాల్లో అభిమానుల అరుపులు, చీర్స్ను స్ఫూర్తిగా తీసుకుని.. వాటిని ఓ సౌండ్వేవ్గా రూపాంతరం చెందించి జెర్సీకి రూపకల్పన చేశారు. పర్సియన్ బ్లూ, రాయల్ బ్లూ రంగుల్లో టీమ్ ఇండియా నయా జెర్సీ కొత్తదనంతో నిండివుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జశ్ప్రీత్ బుమ్రాలు నూతన జెర్సీలు ధరించిన ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.