Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ప్రాంఛైజీల టెండర్లపై బీసీసీఐ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు నూతన ప్రాంఛైజీల కోసం టెండరు ప్రక్రియ గడువును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి పొడగించింది. ఆగస్టు 31న ఇన్విటేషన్ టు టెండర్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. టెండరు దాఖలుకు గడువును తొలుత అక్టోబర్ 10కి పెంచింది. మార్కెట్ వర్గాలు, ఆసక్తి చూపుతున్న కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో టెండరు దాఖలు గడువును అక్టోబర్ 20 వరకు పెంచుతున్న బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 25న రెండు నూతన ప్రాంఛైజీలను బోర్డు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. అదే రోజు రానున్న ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార, డిజిటల్ మీడియా హక్కులకు సైతం బోర్డు టెండర్లు పిలువనుంది. అహ్మదాబాద్, లక్నో, గౌహతి నగరాలు నూతన ఐపీఎల్ ప్రాంఛైజీల రేసులో ముందున్నాయి. రెండు నూతన ప్రాంఛైజీల నుంచి బీసీసీఐ సుమారు రూ.7000 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. పలు దిగ్గజ కార్పోరేట్ సంస్థలు ఐపీఎల్ ప్రాంఛైజీల కోసం పోటీపడుతున్నా బీసీసీఐ పలుమార్లు గడువు పొడిగించటంలో ఆంతర్యం అంతుచిక్కటం లేదు!.