Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు
ముంబయి : 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపికలో సీనియర్ సెలక్షన్ కమిటీ దాగుడు మూతలు ఆడుతోంది!. ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తోన్న ఆటగాళ్లను నెట్ బౌలర్లు, స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేస్తున్న సెలక్షన్ కమిటీ.. తాజాగా తుది జట్టులోనూ కీలక మార్పు చేసింది. ప్రపంచకప్ జట్టులో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉన్నారనే విమర్శల నేపథ్యంలో ఓ స్పిన్నర్‌పై వేటు వేసి, మరో పేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు.. చెన్నై సూపర్‌కింగ్స్ పేసర్ శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. యువ పేసర్లు అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్‌లను ఇప్పటికే నెట్ బౌలర్లుగా తీసుకున్న సంగతి తెలిసిందే. శార్దుల్ ఠాకూర్ ఎంపికతో హార్దిక్ పాండ్య స్థానంలో అతడిని పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి.