Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: విరాట్ కోహ్లి సారథ్యంలోని టీ20 ప్రపంచ కప్ జట్టులో టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదనీ.. వాళ్లు కొంచెం పరిపక్వతతో ఆడితే ట్రోఫీ సాధించడం కష్టమేమి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఈసారి భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని తెలిపాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. అక్టోబరు 24న భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 'చాంపియన్లుగా నిలవడమనేది మామూలు విషయం కాదు. ఆరంభ మ్యాచ్‌లో గెలిచినంత మాత్రాన కప్ సాధించినట్టు కాదు. సిరీస్ అంతా రాణించాలి. ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తేనే కప్ మన సొంతమవుతుంది. అంతకంటే ముందు చాలా మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అందుకే, టైటిల్ గురించి ఆలోచించకుండా.. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే భారత్ దృష్టి పెట్టాలి.