Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రతినిధి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిందో లేదో పొట్టి కప్పు కోసం సమరం మొదలైంది. క్రీడాభిమానులను కనువిందు చేసేందుకు క్రికెట్ జట్లు సిద్దమయ్యాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వీక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ పోటీలతో టీ20 వరల్డ్‌కప్ సమరం ఆరంభం అయ్యింది.
క్రికెట్ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగా గ్రూపు-బిలో ఉన్న పపువా న్యూగినియా ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది.ఆరంభ మ్యాచ్‌లో ఒమన్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్... పపువాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఒమన్ ...టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలోనిమెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్ ఇలియాస్ (50), జితేందర్ సింగ్(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(4)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
కల నెరవేరింది.. భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన పపువా న్యూగినియా జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది. ఏండ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కండ్లు చెమర్చాయి.
ఇరు జట్ల స్కోర్లు.
పపువా న్యూగినియా129/9 (20)
ఒమన్ 131/0 (13.4)